అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ పక్వాడా, గ్రాడ్యుయేషన్ డే

నవగీతం, కోరుట్ల ప్రతినిధి: కోరుట్ల పట్టణంలోని సాయిరాం నగర్-1 అంగన్వాడీ కేంద్రంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 'పోషణ పక్వాడా' అవగాహన కార్యక్రమం మరియు చిన్నారుల 'గ్రాడ్యుయేషన్ డే' వేడుకలు అత్యంత ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు మరియు 0-6 సంవత్సరాల పిల్లలు తీసుకోవాల్సిన పౌష్టికాహారం ప్రాముఖ్యతను వివరిస్తూ, జంక్ ఫుడ్ విడనాడి ఇంట్లో వండిన ఆహారాన్నే తీసుకోవాలని అధికారులు సూచించారు. 3-6 ఏళ్ల పిల్లలను అంగన్వాడీలకు పంపడం వల్ల కలిగే ప్రయోజనాలను, వారి అభివృద్ధి మైలురాళ్లను తల్లిదండ్రులకు...