అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి ఆర్డీవో మహేశ్వర్

నవగీతం, కరీంనగర్: అంగన్వాడీ స్కూల్‌ల సేవలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో మహేశ్వర్ సూచించారు. పిల్లల సమగ్ర అభివృద్ధిలో ఈ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. కరీంనగర్‌లోని కోతిరాంపూర్ అంగన్వాడీ సెంటర్లలో ప్రీ స్కూల్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీవో మహేశ్వర్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, సీడిపిఓ సబితా, 39 డివిజన్ కార్పొరేటర్ లుమాసం గణేష్, కార్పొరేటర్ పాడిశెట్టి వసంతలక్ష్మి భూమయ్య హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఆర్డీవో మహేశ్వర్ మాట్లాడుతూ, అంగన్వాడీ స్కూల్‌లు ప్రైవేట్ స్కూల్‌లతో పోలిస్తే...