అంగరంగ వైభవంగా మల్లన్న జాతర
ఏకిన్ పూర్ లో మిన్నంటిన ఆధ్యాత్మిక శోభ శివాలెత్తిన శివసత్తులు. నవగీతం, కోరుట్ల ప్రతినిధి: కోరుట్ల పట్టణంలోని 6వ వార్డు ఏకిన్ పూర్ లో శ్రీ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవం కనులపండువగా జరిగింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో భక్తుల రాకతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ శిరీష శేఖర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. జాతరలో భాగంగా...