navageetam.com
Newspaper Banner
Date of Publish : 27 March 2026, 11:04 am Digital Edition : NAVAGEETAM

అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

నవగీతం,ఇబ్రహీంపట్నం :

ఇబ్రహీంపట్నం మండలంలోని అమ్మక పేట గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆదర్శ మూర్తులైన శ్రీ సీతారాముల కళ్యాణం కనులారా చూసి భక్తులు పులకించిపోయారు.అలా వైకుంఠం ఇలకు దిగివచ్చినట్లు శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. అందంగా అలంకరించబడ్డ కళ్యాణ వేదికలో వేద పండితులు  మల్లికార్జున్  ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల భక్తుల రామనామ స్మరణతో కళ్యాణం జరుగగా పెళ్లి వేదిక పై పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో శ్రీ సీతారామచంద్రమూర్తి భక్తులకు దర్శనమిచ్చారు.ఉదయం నుండే కళ్యాణ కార్యక్రమాలు మహిళలు భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు దంపతులచే కళ్యాణం జరిపించగా వారే భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు స్వామివారి హనుమాన్ భక్తులు మహిళలు పాల్గొన్నారు.