అంజన్న కృపతో భక్తుల సందోహంలో ఘనంగా 40వ గిరిప్రదక్షిణ
నవగీతం,కొడిమ్యాల ప్రతినిది: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన కొండగట్టులో 40వ గిరిప్రదక్షిణ ఘనంగా, భక్తి వాతావరణంలో నిర్వహించబడింది. పూజ్య గురువులు శ్రీ సురేష్ ఆత్మారామ్ మహరాజ్ ఆశీస్సులతో ప్రతి పౌర్ణమికి జరిగే ఈ గిరిప్రదక్షిణ కార్యక్రమం ఈసారి 40 వ మైలురాయిని చేరుకోవడంతో విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రం నలుమూలల నుండి సుమారు 25 వేల మంది భక్తులు ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో పాల్గొన్నారు. ఉదయం 6:30 గంటలకు గురువు కొబ్బరికాయ కొట్టి శాస్త్రోక్తంగా గిరిప్రదక్షిణకు శ్రీకారం చుట్టారు. చిన్నారులు, మహిళలు,...