navageetam.com
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 11:19 pm Digital Edition : NAVAGEETAM

అంబేద్కర్ నగర్ లో ఘనంగా బాబా సాహెబ్ జయంతి వేడుకలు

వైఎంఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

నవగీతం,కోరుట్ల ప్రతినిధి :

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్‌ నగర్‌లో వైఎంఎస్  అధ్వర్యంలో ర్యాలీ తీసి అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలు స్థానిక యువత  ప్రజల ఉత్సాహం మధ్య పండుగ వాతావరణంలో జరిగాయి. అంబేద్కర్  భారీ చిత్రపటాన్ని ట్రాక్టర్‌పై ఉంచి పట్టణంలో ఊరేగించారు.
ఈ చిత్రపటంపై “చరిత్రలో ఒకడు కాదు.. చరిత్రకు ఒక్కడు” అని రాసి ఉన్న నినాదం అందరినీ ఆకట్టుకుంది.డీజే పాటల మధ్య యువత ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు నీరాజనాలు అర్పించారు.

నీలి జెండాలు చేతబూని ‘జై భీమ్’ నినాదాలతో కోరుట్ల పురవీధులు మారుమోగాయి. ఈ సందర్భంగా వైఎంఎస్ ప్రతినిధులు మాట్లాడుతూ.. సమాజంలో సమానత్వం కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.
ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వైఎంఎస్ నాయకులు, సభ్యులు, అంబేద్కర్‌ నగర్ వాసులు మరియు పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.