అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా నిలవాలి: మానుక ప్రవీణ్ కుమార్

నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి: మెట్‌పల్లి మార్కెట్ యార్డులో అకాల వర్షం, గాలి దుమారంతో నష్టపోయిన రైతులను కోరుట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ మానుక ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా తడిసిపోయిన వరి ధాన్యం, నష్టపోయిన మొక్కజొన్న పంటలను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిస్థాయిలో...