అత్త సర్పంచ్… అల్లుడు పెత్తనం..!
చోద్యం చూస్తున్న అధికారులు సమీక్ష సమావేశానికి సర్పంచ్ అల్లుడు హాజరు "మహిళా ప్రజాప్రతినిధులకు ఇదేనా గౌరవం?" అంటూ గ్రామస్తుల ఆవేదన నవగీతం,మల్లాపూర్:జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మండల, గ్రామాభివృద్ధి కార్యక్రమాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రోటోకాల్ ఉల్లంఘన చోటుచేసుకుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, సంబంధిత అధికారులు పాల్గొన్న ఈ సమావేశానికి వాల్గొండ గ్రామ సర్పంచ్ శ్రీమతి తోపారపు వసంత అల్లుడు శాఖపురపు కిరణ్ హాజరుకావడం వివాదాస్పదంగా మారింది. ఆయన ప్రజాప్రతినిధి కాదని, వాల్గొండ గ్రామ ఓటరు...