అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఘన సన్మానం

నవగీతం,కోరుట్ల ప్రతినిధి : కోరుట్ల పట్టణంలో కట్కం సంగయ్య ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పదవ తరగతి ఫలితాల్లో మండల స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రభంజనం సృష్టించిన శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులను స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. క్రమశిక్షణ, నిరంతర కృషితోనే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని, ఉన్నత శిఖరాలను అధిరోహించి కోరుట్ల నియోజకవర్గానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు.మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు శాలువాలతో సత్కరించి మెమెంటోలు...