navageetam.com
Newspaper Banner
Date of Publish : 10 May 2026, 7:17 pm Digital Edition : NAVAGEETAM

అనాధలకు ఆపద్బాంధవుడుగా మోహన్ యోగి

నవగీతం,ఇబ్రహీంపట్నం ప్రతినిధి:

ఇబ్రహీంపట్నం మండలంలోని బర్దిపూర్ గ్రామంలో ఉన్న బోలే నాథ్ కర్బల దేవస్థానంలో పేదింటి వారి వివాహనికి మోహన్ యోగి హాజరై నూతన వధూవరుల జంటకు ఆడపడుచు కట్నంగా చీర రూ.5016/- కానుక ను నవ వధువులకు అందించారు. ఈ సందర్భంగా మోహన్ యోగి మాట్లాడుతు.. నిరుపేదలకు ఎప్పుడుగా అండగా ఉంటూ సేవ చేయడానికి ముందు ఉంటానని తెలిపారు. భోలేనాథ్ కార్బన్ దేవస్థానం విస్తృతంగా రోజురోజుకు గుర్తింపు వస్తుందని అన్నారు. మంచి చేసే వారికి దేవుడు ఎప్పుడు సహాయకారిగా ఉంటాడని ఆయన హితవుపలికారు. నిరుపేదలను చేరదీస్తూ తన వంతు సహాయాన్ని చేస్తూ నేనున్నానని భరోసాను కల్పిస్తానని మోహన్ యోగి అన్నారు. నవవధువులు గంగోత్రి సాయికుమార్ లను ఆశీర్వదించారు భర్తీ పూర్ గ్రామాన్ని ఒక పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ట్రస్టు సభ్యులు పూజారులు పాల్గొన్నారు