అనారోగ్యంతో పారిశుద్ధ్య కార్మికుడు మృతి

కుటుంబాన్ని ఆదుకున్న సర్పంచ్, గ్రామస్తులు నవగీతం,కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం శనివారం పేట గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న సింగారపు మల్లయ్య సోమవారం అనారోగ్యంతో మృతి చెందాడు. నీరుపేద కుటుంబానికి చెందిన మల్లయ్య మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.మల్లయ్య కుటుంబాన్ని ఆదుకునేందుకు సర్పంచ్ గోలి ఐలయ్య రూ.5,000 ఆర్థిక సాయం అందించారు. గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు రూ.10,000, గ్రామస్తులు కలిసి రూ.32,000 సేకరించి మొత్తం రూ.47,000 సహాయంగా అందజేశారు.ఈ మేరకు మంగళవారం మల్లయ్య కుమారుడు శశికుమార్‌కు గ్రామ పెద్దలు, ప్రజల సమక్షంలో నగదు...