అనారోగ్యంతో బాధపడుతున్న అంజయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం

నవగీతం. కొడిమ్యాల ప్రతినిధి: గంగాధర మండలం కాచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గీకురు అంజయ్య (42) గత నాలుగేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమై ఉన్నారు.అంజయ్య పరిస్థితిని గమనించిన జగిత్యాల జిల్లా విద్యుత్ ఉద్యోగుల ఆధ్వర్యంలో పవర్ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ సభ్యులు ఆయన కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. వీరబత్తిని గంగా సాగర్ అభ్యర్థన మేరకు పూడూర్ లైన్‌మెన్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ సహాయం అందించారు.తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి కుటుంబానికి విద్యుత్ ఉద్యోగులు ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ...