navageetam.com
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 11:17 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబానికి వేంపల్లి గల్ఫ్ మిత్ర బృందం ఆర్థిక సహాయం

మల్లాపూర్, ఆగస్టు 14(నవగీతం): జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన గణవేణి మహేష్ యాదవ్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబానికి అండగా నిలిచి, భరోసా కల్పించాలనే ఉద్దేశంతో వేంపల్లి గల్ఫ్ మిత్ర బృందం సభ్యులు రూ.5,000 ఆర్థిక సహాయం అందించారు.ఈ సందర్భంగా గల్ఫ్ మిత్ర బృందం సభ్యులు మాట్లాడుతూ, మహేష్ యాదవ్ కుటుంబానికి తమ వంతు సహకారం అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో వేంపల్లి గల్ఫ్ మిత్ర బృందం సభ్యులు పాల్గొని, మృతుడి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.