అనుమానాస్పద వ్యక్తులకు లాడ్జ్ గదులు ఇవ్వొద్దు, గుర్తింపు పత్రాలు తప్పనిసరి

ధర్మపురి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామ్ నరసింహారెడ్డి సీసీ కెమెరాల ఏర్పాటు పై ప్రత్యేక దృష్టి నవగీతం, జగిత్యాల/ధర్మపురి: ధర్మపురి పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ మరియు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ధర్మపురి పోలీసు శాఖ ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని లాడ్జ్ యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ధర్మపురి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామ్ నరసింహారెడ్డి హాజరై లాడ్జ్ నిర్వాహకులు తప్పనిసరిగా పాటించవలసిన భద్రత నిబంధనలు మరియు మార్గదర్శకాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, లాడ్జ్‌లలో గదులు కేటాయించే...