navageetam.com
Newspaper Banner
Date of Publish : 09 February 2026, 6:08 am Digital Edition : NAVAGEETAM

అన్నదానం ప్రారంభించిన సర్పంచ్ తోట శ్రీనివాస్

నవగీతం, మల్లాపూర్:

మల్లాపూర్ మండలంలోని రాఘవపేట గ్రామంలో పెద్దమ్మ తల్లి దేవస్థానం ఆలయంలో జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ తోట శ్రీనివాస్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కమ్మల రమేష్, ఉపాధ్యక్షులు దాసరి మనోజ్ సభ్యులు ద్యావతి వెంకట్ బృందం,ముదిరాజ్ సంఘ సభ్యులు,నాయకులు బైరి రవికుమార్ యాదవ్, రాకేష్ యాదవ్,లక్ష్మణ్, రాజా శేఖర్, దేవరెడ్డి, కమలాకర్, సురేష్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు