navageetam.com
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 5:10 pm Digital Edition : NAVAGEETAM

అపోహాలు చెందకుండా పెన్షన్ల ప్రత్యక్ష ప్రమాణీకరణ చేసుకోండి

ఎంపీడీవో అలవాల శ్రీకాంత్

నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి

మల్లాపూర్ మండల ప్రజలు అపోహలు చెందకుండా నిస్సందేహంగా సిబిఎస్- లైవ్ పెన్షన్ అథెంటికేషన్ (పెన్షన్ల ప్రత్యక్ష ప్రమాణీకరణ) చేసుకోవాలని మల్లాపూర్ ఎంపీడీవో అలవాల శ్రీకాంత్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, సీఈఓ సెర్ప్ ఆదేశానుసారం మండలంలో గల పెన్షన్సర్లు కి సిబిఎస్ – పెన్షన్ల ప్రత్యక్ష ప్రమాణీకరణ సర్వే నడుస్తుంది .దీనిలో భాగంగా పంచాయతి సెక్రటరీ లు మీ ఇంటి వద్దకి వచ్చి మీయొక్క ముఖాన్ని  లైవ్ అథెంటికేషన్ ద్వారా ఫోటో తీసుకుంటారు. దీనితో మీ పెన్షన్ లైవ్ అథెంటికేషన్ పూర్తి అవుతుంది అలాగే మీరు నిజమైన పెన్షన్ ధారులా కాదా అనేది నిర్దారణ అవుతుంది. ప్రజలు ఎవరు ఈ విషయంలో అపోహలు చెందకుండా మీ యొక్క సమాచారాన్ని వారికీ తెలియచేసి వారికి సహకరించగలరని తెలిపారు.ఈ సర్వే ద్వారా మీ పెన్షన్స్ లు ఎక్కడికి పోవు అలాగే ఆగిపోవడం జరగదు. నిస్సందేహంగా మీ పెన్షన్ ని లైవ్ అథెంటికేషన్ ని పూర్తి చేసుకోవాలని దీనిపై మీకెలాంటి సందేహాలు అపోహలు ఉన్న మీరు మండల పరిషద్ అభివృద్ధి అధికారి ని సంప్రదించాలని అన్నారు