అభివృద్ధే ధ్యేయం.. హస్తమే లక్ష్యం
27వ వార్డులో ఉనుకొండ సరస్వతి ముమ్మర ప్రచారం నవగీతం, పెద్దపల్లి: పెద్దపల్లి పట్టణాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అహర్నిశలు కృషి చేస్తున్నారని,ఆయన చేస్తున్న అభివృద్ధిని చూసి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని 27వ వార్డు అభ్యర్థి ఉనుకొండ సరస్వతి-వైకుంటం కోరారు.శుక్రవారం వార్డులోని పలు వీధుల్లో ముమ్మర ప్రచారం నిర్వహించిన ఆమె, ఇంటింటికీ తిరిగి హస్తం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.ఈ సందర్భంగా ఉనుకొండ సరస్వతి-వైకుంటం మాట్లాడుతూ ఎమ్మెల్యే విజయరమణారావు పదవి చేపట్టిన నాటి నుండి పట్టణ...