navageetam.com
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 3:27 pm Digital Edition : NAVA GEETAM

అమ్మవారి ఆభరణాలను ఎదుర్కొని తీసుకొచ్చిన కమిటీ సభ్యులు

మల్లాపూర్,అక్టోబర్ 12(నవగీతం):

మల్లాపూర్ మండల కేంద్రంలోని శ్రీ కనకదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి బంగారు, వెండి ఆభరణాలను కమిటీ సభ్యులు సన్నాయి మేళతాళాల నడుమ ఎదుర్కొని తీసుకొచ్చారు. అనంతరం ఆభరణాలతో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో అలంకరించారు.

అమ్మవారి అలంకరణతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ కనకదుర్గ సేవా సమితి కమిటీ సభ్యులు తోట రవీందర్, నాంపల్లి మారుతి, కైరా రామగౌడ్, తోట శేఖర్, ముస్కరి రాజు, చంద్రగిరి లక్ష్మణ్, ముస్కారి రాజేష్, తేలు రాజేష్, రెవెల్లి నవీన్, రామ నవీన్ తదితరులు పాల్గొన్నారు.