అమ్మే దైవం – అమ్మే ప్రాణం’
నవగీతం,కోరుట్ల ప్రతినిధి. నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం ప్రత్యేక కథనం. ఈ ప్రపంచంలో 'అమ్మ' అనే రెండక్షరాల పిలుపులో ఉన్న మాధుర్యం మరే పిలుపులోనూ ఉండదు.సృష్టికి మూలం అమ్మ.అసలు నిర్వచనం లేని ప్రేమకు నిలువెత్తు రూపం అమ్మ. మన కంటికి కనిపించే దైవం ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా అమ్మే.బిడ్డ పెదవిపై చిరునవ్వు కోసం తన సర్వస్వాన్ని ధారపోసే త్యాగశీలి అమ్మ.త్యాగానికి మరో పేరు అమ్మ.ఒక జీవిని భూమి మీదకు తీసుకురావడానికి అమ్మ పడే ప్రసవ వేదన వర్ణనాతీతం.ఆ బాధను చిరునవ్వుతో భరిస్తూ, బిడ్డ...