navageetam.com
Newspaper Banner
Date of Publish : 15 January 2026, 4:40 pm Digital Edition : NAVAGEETAM

అయ్యప్ప ఆభరణాలు ఊరేగింపు

పురవీధుల్లో మార్మోగిన అయ్యప్ప నామస్మరణ

నవగీతం,వైరా:

మకర సంక్రాంతి పవిత్ర రోజున పురస్కరించుకొని అయ్యప్ప స్వామి భక్తులు యండ్రపుడి శివశంకర్, కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి ఆభరణాలు ఊరేగింపు మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వైరాలోని యండ్రపూడి కృష్ణారావు (తాతయ్య గురుస్వామి) వారి నివాసం నుండి యండ్రపూడి శివ శంకర్ రమాదేవి దంపతులు యండ్రపూడి నితీష్ లు అయ్యప్ప స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అయ్యప్ప స్వామి ఆభరణాలను తలపై పెట్టుకుని స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో పురవీధుల్లో మేళా తాళాలు దప్పు వాయిద్యాలు టపాసుల కాంతులతో ఆభరణాల యాత్ర శోభ యమానంగా సాగింది.. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఒకరి తర్వాత ఒకరు ఆభరణాలను తలపై ఎత్తుకొని భక్తి పరవశంలో మునిగితేలారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప దేవాలయం గౌరవ అధ్యక్షులు వనమా విశ్వేశ్వరరావు, నాయుడు వరుణ్ దంపతులు, కొప్పురావూరి సుమంత్ శబరి నాథ్, నూకల వాసు, రాయల నాగేశ్వరరావు( గురు స్వామి) కొణతాలపల్లి సుజిత్, సుగ్గల విజయ్, మాలే ఉదయ్ తేజ, సింగు బద్రి, వజినేపల్లి రవి, కొమిరిశెట్టి శ్రీధర్, నూకల ప్రసాద్, కొప్పురావూరి కృష్ణమూర్తి, కొల్లా రాంబాబు నంబూరు ప్రసాద్ బోనాల నిఖిల్ తదితరులు పాల్గొన్నారు