అయ్యా కలెక్టర్ గారు.. స్పందించండి
విద్యాశాఖ, ఆర్టిఏ అధికారులు చర్యలు తీసుకోండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డ్రైవర్ అన్న సందేశం నవగీతం, మల్లాపూర్: మల్లాపూర్ మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందిన డ్రైవర్ దోసరాజు సోషల్ మీడియాలో సందేశాన్ని పోస్ట్ చేశారు.. జిల్లా కలెక్టర్..ఆర్టీఏ , విద్యాశాఖ అధికారులకు నమస్కరించి అయ్యా.. ఈ మధ్యకాలంలో పాఠశాల వాహనాలు అనేక ప్రాంతాలలో ప్రమాదాలకు గురి అవుతున్నవి. ఈ మధ్యనే మా మల్లాపూర్ మండలంలో రెండు సంఘటనలు జరిగినవి దీనికి మొదటి కారణం డ్రైవర్ నిర్లక్ష్యం, రెండవది పాఠశాల యజమాన్యాలు సరియైన డ్రైవర్లను ఎంచుకోకపోవడం......