అరిటాకుల్లో సంప్రదాయ విందు..వాల్గొండలో భక్తులకు అన్నదానం
మల్లాపూర్, సెప్టెంబర్ 22 (నవగీతం): మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గ సేన ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులను క్రమపద్ధతిలో కూర్చోబెట్టి, అరిటాకుల్లో సంప్రదాయ పద్ధతిలో అన్నం, పప్పు, కూరలు తదితర వంటకాలను వడ్డించారు. అరిటాకుల్లో భోజనం చేయడం మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని దుర్గ సేన యూత్ సభ్యులు తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భోజనం స్వీకరించారు. “అన్నదానం మహాదానం” అనే సేవాభావంతో నిర్వహించిన...