అవినీతి, మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరభేరి
నిరసిస్తూ బీఆర్ఎస్ భారీ ధర్నా 420 అడుగుల హామీల ఫ్లెక్సీతో రోడ్ ప్రదర్శన.. కోరుట్లలో ఏమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో జగిత్యాల/కోరుట్ల,సెప్టెంబర్2,(నవగీతం): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టారు.ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో...