navageetam.com
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 12:10 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిన సమీకృత కూరగాయల మార్కెట్

నిలిచిపోయిన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలి..

మున్సిపల్ కార్యాలయం ముందు బిజెపి ధర్నా

నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి:

మెట్ పల్లి పట్టణంలో సమీకృత కూరగాయల మార్కెట్ నిర్మాణం పూర్తిస్థాయిలో అభివృద్ధి జరిగాక నిలిచిపోయిన పనులను వెంటనే ప్రారంభించాలని భారతీయ జనతా పార్టీ మెట్ పల్లి పట్టణ శాఖ అధ్యక్షుడు ధోనీకెల నవీన్ ఆధ్వర్యంలో మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయం ముందు బిజెపి కార్యకర్తలు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షుడు దొనికెల నవీన్ మాట్లాడుతూ సమీకృత మార్కెటు అభివృద్ధి పనులు నిలిచిపోవడంతో రైతులు వ్యాపారస్తులు కూరగాయల అమ్మకాలు రహదారి వెంబటే ప్రజలు విక్రయిస్తున్నారని దానితో ట్రాఫిక్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్డు ప్రమాదాలకు ప్రజలు బలి అవుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు సమీకృతం మార్కెట్ ప్రారంభించి సంవత్సరాలు గడుతున్న అధికారులు ఎందుకు చర్యలు తీసుకోకపోవడం వెనకాల ఉన్న మతలబులు ఏమిటని ప్రశ్నించారు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా సమీకృతం మార్కెట్ నడుస్తుందని ఆరోపించారు. రోడ్డు మీదనే విక్రయాలు జరుగుతున్నా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న అధికారులు కళ్ళు మూసుకున్నారా అని ప్రశ్నించారు. తక్షణమే సమీకృత మార్కెట్ పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకొని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందించారుఈ కార్యక్రమంలో మెట్పల్లి మున్సిపల్ బిజెపి ఫ్లోర్ లీడర్ ధర్మపురి స్వరూప వేణుగోపాల్ , డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బొడ్ల ఆనంద్, బిజెపి కౌన్సిలర్ కోయల్కర్ స్రవంతి లింగేశ్వర్ బోడ్ల వసుధ నాగేష్ బిజెపి నాయకులు కలికోట శ్రీకాంత్ బత్తుల జగదీష్ పాస్ కంటి శ్రీనివాస్ మిట్టపల్లి కృష్ణమూర్తి కొయ్యల లక్ష్మణ్ సుంకే అశోక్ నూనె క్రాంతి మర్రి నర్సయ్య, బొడ్ల అనిల్ గుండవేని శేఖర్ సత్యనారాయణ హనుమాన్లు భాస్కర్ భోగ దత్తు జగన్ గుండు మోహన్ కాదాసు శ్రీనివాస్ ప్రభాకర్ దండిక నరసయ్య రఘుపతి సదానందం బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు