navageetam.com
Newspaper Banner
Date of Publish : 24 February 2026, 7:48 am Digital Edition : NAVAGEETAM

ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరై తమ ప్రతిభను చాటాలి..

జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు 25వ తేది బుధవారం నుండి ప్రారంభం కానున్న సందర్భంగా హాజరవుతున్న విద్యార్థులకు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అల్ ది బెస్ట్ తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరై తమ ప్రతిభను చాటాలని సూచించారు.పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు ఒక ముఖ్యమైన దశ అని పేర్కొన్నారు. క్రమశిక్షణ, సమయపాలనతో పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని సూచించారు. హాల్ టికెట్ వెంట తీసుకెళ్లాలని తెలిపారు.జిల్లా యంత్రాంగం తరఫున పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు కల్పించినట్లు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి వత్తిడికి గురికావొద్దని, తల్లిదండ్రులు విద్యార్థులకు మానసిక ధైర్యం కల్పించి, ఒత్తిడి లేకుండా పరీక్షలకు పంపాలని సూచించారు. విద్యార్థులందరూ ఉత్తమ ఫలితాలు సాధించి మన జిల్లాకు , రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.