ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరై తమ ప్రతిభను చాటాలి..
జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ నవగీతం, జగిత్యాల ప్రతినిధి: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు 25వ తేది బుధవారం నుండి ప్రారంభం కానున్న సందర్భంగా హాజరవుతున్న విద్యార్థులకు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అల్ ది బెస్ట్ తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరై తమ ప్రతిభను చాటాలని సూచించారు.పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు ఒక ముఖ్యమైన దశ అని పేర్కొన్నారు. క్రమశిక్షణ, సమయపాలనతో పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని సూచించారు. హాల్ టికెట్ వెంట తీసుకెళ్లాలని తెలిపారు.జిల్లా యంత్రాంగం తరఫున పరీక్షలు...