ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి.
914 మంది సిబ్బందితో పటిష్ట భద్రత, సీసీ కెమెరాలు ద్వారా నిరంతర పర్యవేక్షణ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ నవగీతం,జగిత్యాల ప్రతినిధి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు క్షేత్రంలో చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం భద్రత కార్యక్రమాలపై మల్యాల ఎక్స్ రోడ్ వద్ద గల కొత్త సురేష్ ఫంక్షన్ హాల్ లో బ్రీఫింగ్ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ..భక్తులు ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో స్వామి వారిని దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ...