ఆరపేట వార్డు కౌన్సిలర్ గా బీజేపీ అభ్యర్థి ఘన విజయం

చైర్మన్ రేసులో దివ్య కిషోర్ రెడ్డి..? నవగీతం, జగిత్యాల ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ రసవత్తరంగా కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు మెట్ పల్లి మున్సిపల్ ఫలితాలు విడుదలవుతున్నాయి. అయితే ఈసారి ఎన్నికల్లో తొలిసారి పోటీచేసిన కొందరు అభ్యర్థులు విజయం దిశగా కొనసాగుతున్నారు. అందులో భాగంగా మెట్ పల్లి మున్సిపల్ పరిధిలోని అయిదో వార్డు అయిన ఆరపేటలో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన పుడుకారం దివ్య కిషోర్ రెడ్డి ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోపిడి కవిత పైన ఘన విజయం సాధించారు. దివ్య కిషోర్...