మల్లాపూర్, అక్టోబర్ 17 (నవగీతం):
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వి.వి. రావుపేట గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ఆరెల్లి మహేష్ ఆహ్వానం మేరకు తెలంగాణ రక్షణ సేన పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ రఘు శనివారం ఆయన ఇంటికి వెళ్లి తేనీటి విందు స్వీకరించారు.
తొలిసారిగా తన ఇంటికి విచ్చేసిన డాక్టర్ రఘుకు ఆరెల్లి మహేష్ శాలువాతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని పలు సమస్యలు, స్థానిక పరిస్థితులు, ఇతర అంశాలపై ఇరువురు చర్చించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.