ఆర్‌టీఐ అమలులో నిర్లక్ష్యం వద్దు

రాష్ట్ర సమాచార కమిషనర్లకు యుఎఫ్ఆర్టీఐ ప్రతినిధుల వినతి నవగీతం ,పెద్దపల్లి: జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టాన్ని పారదర్శకంగా అమలు చేయాలని,దరఖాస్తుదారులకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని యునైటెడ్ ఫోరం ఆర్‌టీఐ క్యాంపెయిన్ నాయకులు రాష్ట్ర సమాచార కమిషనర్లను కోరారు.బుధవారం పెద్దపల్లి జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్లు పి.వి.శ్రీనివాసరావు,దశరథ భూపాల్,మోహిసినా పర్వీన్, బోరెడ్డి అయోధ్య రెడ్డిలను ఎన్టీపీసీ సింగరేణి ఇల్లందు గెస్ట్ హౌస్‌లో యుఎఫ్ఆర్టీఐ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా కమిషనర్లను శాలువాలతో ఘనంగా సన్మానించి,2026 నూతన సంవత్సర...