ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ మద్దతు
నవగీతం ,కోరుట్ల ప్రతినిధి : ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మెకు కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా కార్మికులను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, కార్మికుల డిమాండ్లు న్యాయమైనవని పేర్కొన్నారు. గతంలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించి జీవో గెజిట్ విడుదలైన విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రభుత్వం త్వరితగతిన స్పందించి పెండింగ్‌లో ఉన్న ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. కార్మికులు శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అవసరమైన...