navageetam.com
Newspaper Banner
Date of Publish : 09 April 2026, 12:57 pm Digital Edition : NAVAGEETAM

ఇంటి పన్నుపై ఐదు శాతం రాయితీ పొందండి

మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి

నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి:

రాష్ట్ర ప్రభుత్వం మున్సి పాలిటీలలోని ప్రజలకు ఇంటి పన్నుపై ఐదు శాతం రాయితీని ప్రకటించిందని, మెట్ పల్లి పట్టణ ప్రజలు సద్వినియోగం చేసు కోవాలని మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి కోరారు. బుధవారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ పట్టణం లోని 26 వార్డుల ప్రజలు ముందస్తు ఇంటి పన్ను చెల్లించి ఐదు శాతం రాయితీ పొందాలన్నారు. ఈ నెల 30 వరకు రాయితీ ఐదు శాతం తగ్గింపు ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరు ఇంటి పన్ను చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని కోరారు.