navageetam.com
Newspaper Banner
Date of Publish : 24 January 2026, 10:26 am Digital Edition : NAVAGEETAM

ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో కూలీగా మారిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్

నవగీతం,వైరా:

వైరా మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించి నేరుగా ప్రజల దగ్గరికి వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్న వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఈ సందర్భంగా వైరా మున్సిపాలిటీ ఏడో వార్డ్ నందు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం జరుగుతుంటే అక్కడున్న కూలీలను ఇంటి యజమానిని అడిగి ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో ఉన్న లోపాలను అడిగి తెలుసుకున్నారు. అందులో భాగంగా వారు మాకు చాలా చక్కగా ఉంది ఇట్లాంటి అవకాశం స్కీం పెట్టడం మా అదృష్టమని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ కూలీలతో కలిసి తట్ట మోసి కూలీగా మారిన శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ ఈ కార్యక్రమంలో వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.