navageetam.com
Newspaper Banner
Date of Publish : 08 November 2026, 8:08 pm Digital Edition : NAVA GEETAM

ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కొడంగల్,నవంబర్8,(నవగీతం):

ఒకవైపు దీపావళి పర్వదినం.. మరోవైపు జన్మదినం.. ఈ రెండు శుభసందర్భాలను పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇంట్లో దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు.

కొడంగల్ మండలం పర్సాపూర్ గ్రామానికి చెందిన గోరిపల్లి సుమిత్ర, శ్రీనివాస్ దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా దంపతులకు నూతన వస్త్రాలను బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి ఇంట్లోనే సన్నబియ్యంతో వండిన భోజనాన్ని ముఖ్యమంత్రి స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, ధనసరి అనసూయ సీతక్క, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొని దంపతుల ఇంట్లో ముఖ్యమంత్రితో కలిసి భోజనం చేశారు.

అనంతరం ముఖ్యమంత్రి చుట్టూ చేరిన చిన్నారులు టపాసులు కాల్చుతూ దీపావళి సంబరాలు చేసుకున్నారు. వారితో కలిసి ముఖ్యమంత్రి కూడా దీపావళి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులందరికీ పెన్నులను బహూకరించి వారిని ప్రోత్సహించారు.

సామాన్య కుటుంబం నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంట్లో ముఖ్యమంత్రి దీపావళి వేడుకల్లో పాల్గొనడం గ్రామస్థుల్లో ఆనందోత్సాహాలను నింపింది.