ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కొడంగల్,నవంబర్8,(నవగీతం): ఒకవైపు దీపావళి పర్వదినం.. మరోవైపు జన్మదినం.. ఈ రెండు శుభసందర్భాలను పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇంట్లో దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. కొడంగల్ మండలం పర్సాపూర్ గ్రామానికి చెందిన గోరిపల్లి సుమిత్ర, శ్రీనివాస్ దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా దంపతులకు నూతన వస్త్రాలను బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి ఇంట్లోనే సన్నబియ్యంతో వండిన భోజనాన్ని ముఖ్యమంత్రి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు...