ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్ల పనులు వేగవంతం చేయాలి. నవగీతం, మెట్ పల్లి: మెట్ పల్లి మండలం  బండలింగపూర్ గ్రామంలోని నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా చేయాలని అధికారులకు ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ మంజూరైనా ఇందిరమ్మ ఇండ్లను పూర్తిస్థాయిలో గ్రౌండింగ్ చేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం నిర్మించుకునే ప్రతి ఇంటికి తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు అందజేస్తుందని తెలిపారు. ఇటుక,కంకర,బేస్మెంట్ పై ధరల నియంత్రణ ఇండ్లు...