ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను తప్పకుండా పాటించాాలి. నవగీతం, ఇబ్రహీంపట్నం: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గోదూరు గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని ఆయన ప్రత్యక్షంగా పరిశీలించి, లబ్ధిదారులకు ఇళ్లు త్వరితగతిన అందేలా పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను తప్పకుండా పాటించాలని, ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు.లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులు కొనసాగించేందుకు సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో...