ఇఫ్తార్ విందు మతసామరస్యానికి ప్రతీక: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

నవగీతం, జగిత్యాల,ప్రతినిధి: పవిత్ర రంజాన్ ఉపవాస దీక్ష సందర్భంగా ముస్లిం సోదరుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ఆత్మీయతకు, మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని ఖిలగడ్డ కమ్యూనిటీ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు ఖర్జూరం, ఫలహారాలు తినిపించి దీక్షను విరమింప చేశారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు....