ఇబ్రహీంపట్నం కేజీబీవీ విద్యార్థినుల అద్భుత ప్రతిభ

ఇంటర్ ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత నవగీతం,ఇబ్రహీంపట్నం ప్రతినిధి: ఇబ్రహీంపట్నం మండలంలోని స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. సంస్థ విడుదల చేసిన వివరాల ప్రకారం, యంపిహెచ్ డబ్ల్యూ మరియు సిఈసి విభాగాల్లో విద్యార్థినులు అత్యుత్తమ మార్కులు సాధించి పాఠశాలకు మరియు మండలానికి గర్వకారణంగా నిలిచారు.ఈ విద్యాసంవత్సరం ఫలితాల్లో యంపిహెచ్ డబ్ల్యూ (1వ మరియు 2వ సంవత్సరం) సి ఈ సి (2వ సంవత్సరం) విభాగాల్లో పాఠశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం ఎ.నవిత...