ఈడబ్ల్యూఎస్ 10శాతం రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అమలు చేయాలి

ఢిల్లీ ధర్నాలో ఓసి జేఏసీ జిల్లా కన్వీనర్ రాజన్న నవగీతం,జగిత్యాల ప్రతినిధి: దేశంలో  అగ్రవర్ణాలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక అన్యాయాలను ప్రభుత్వం గుర్తించి న్యాయం చేయాలని ఓసి సామాజిక సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా కన్వీనర్ మహంకాళి రాజన్న డిమాండ్ చేశారు. ఓసీ సంక్షేమ సంఘాల ఐక్యవేదిక, న్యూఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద సోమవారం మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో రాజన్న, సిహెచ్ వెంకట ప్రభాకర్ రావులు మాట్లాడుతూ  స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లకు పైగా గడిచినా ఓసి వర్గాలు అనేక రంగాల్లో వెనుకబాటుకు...