ఉచిత గాలిపటాల పంపిణీకి విశేష స్పందన
నవగీతం,రుద్రంగి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో బిజెపి పార్టీ సీనియర్ నాయకుడు బోయిని రాజు ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కైట్ ఫెస్టివల్ నిర్వహించి చిన్నారులకు, యువతి యువకులకు ఉచితంగా పతంగులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా కార్యదర్శి నంద్యాడపు వెంకటేష్ పాల్గొని పంపిణి చేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా కార్యదర్శి నంద్యాడపు వెంకటేష్, బోయిని రాజు లు మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ అంటే మహిళలకు రంగు రంగుల ముగ్గులు, చిన్నారులకు, యువకులకు ఎగురవేసే గాలిపటాలు గుర్తుకు...