ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం
సర్పంచ్ శెట్టిపల్లి శ్రీనివాసరావు నవగీతం,వైరా ప్రతినిధి: గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని సర్పంచ్ శెట్టిపల్లి శ్రీనివాసరావు అన్నారు.సోమవారం రోజున వైరా మండలం పరిధిలోని కేజీ సిరిపురం గ్రామంలో గ్రామపంచాయతీ ఆఫీస్ నందు గ్రేస్ జనరల్ హాస్పిటల్ తనికెళ్లవారు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించి ముందుగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనిషికి సంపద కన్నా ఆరోగ్యం ఎంతో ముఖ్యమని అన్నారు.గ్రేస్ జనరల్ హాస్పిటల్ తనికెళ్లవారు గ్రామీణ ప్రజల ఆరోగ్యం పట్ల దృష్టి...