ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారులను ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
నవగీతం, జగిత్యాల: జిల్లా పోలీసు శాఖలో దీర్ఘకాలం పాటు అంకితభావంతో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందుతున్న పోలీసు అధికారులను జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు శాఖలో పనిచేయడం అనేది కేవలం ఉద్యోగం మాత్రమే కాకుండా సమాజానికి సేవ చేసే గొప్ప బాధ్యత అని అన్నారు. ఉద్యోగ జీవితమంతా ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమించిన అధికారుల సేవలు ఎల్లప్పుడూ...