navageetam.com
Newspaper Banner
Date of Publish : 30 June 2026, 3:10 pm Digital Edition : NAVAGEETAM

ఉద్యోగ విరమణ పొందుతున్న ఎస్బి డీఎస్పీ వెంకటరమణకు ఘన సన్మానం

నవగీతం, జగిత్యాల:

జిల్లా స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ వెంకటరమణ ఉద్యోగ విరమణ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని వీకేబీ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా వీడ్కోలు, సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై వెంకటరమణ ని ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ శాఖలో వెంకటరమణ ఎన్నో సంవత్సరాల పాటు అంకితభావంతో, నిజాయితీతో, క్రమశిక్షణతో సేవలందించారని కొనియాడారు. తన విధి నిర్వహణలో సమర్థత, బాధ్యతాయుతమైన వ్యవహారశైలి, సహోద్యోగులతో సత్సంబంధాలు కలిగి శాఖకు మంచి గుర్తింపు తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ అనేది సేవా జీవితానికి ముగింపు మాత్రమేనని, సమాజ సేవకు కాదని ఎస్పీ అన్నారు. పదవీ విరమణ అనంతరం కూడా ఆరోగ్యంగా, ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా సహచర అధికారులు, పోలీస్ సిబ్బంది వెంకట రమణ తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన సేవలను ప్రశంసించారు. అనంతరం పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించి ఘనంగా వీడ్కోలు పలికారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చేతన్ నితిన్, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, రాములు, ఇన్‌స్పెక్టర్లు ఆరిఫ్ అలీ ఖాన్, సుధాకర్,రవి కరుణాకర్, లక్ష్మీనారాయణ, వేణు,ఎస్‌. ఐ లు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.