ఉద్యోగ విరమణ పొందుతున్న ఎస్బి డీఎస్పీ వెంకటరమణకు ఘన సన్మానం
నవగీతం, జగిత్యాల: జిల్లా స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ వెంకటరమణ ఉద్యోగ విరమణ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని వీకేబీ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా వీడ్కోలు, సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై వెంకటరమణ ని ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ శాఖలో వెంకటరమణ ఎన్నో సంవత్సరాల పాటు అంకితభావంతో, నిజాయితీతో, క్రమశిక్షణతో సేవలందించారని కొనియాడారు. తన విధి నిర్వహణలో సమర్థత, బాధ్యతాయుతమైన వ్యవహారశైలి, సహోద్యోగులతో సత్సంబంధాలు కలిగి...