ఉపాధ్యాయున్ని సన్మానించిన కలెక్టర్
నవగీతం,జగిత్యాల: దక్షిణభారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో రెండవ స్థానం సాధించిన ఉపాధ్యాయుని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సన్మానించారు.సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 23 వరకు నిర్వహించిన దక్షిణ భారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో జగిత్యాల జిల్లా రాయికల్ మండల కుమ్మరి పెల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న కడకుంట్ల అభయ్ రాజ్ తయారుచేసిన సూపర్ సైన్స్ కిట్ ఉపాధ్యాయ బోధనోపకరణాల విభాగంలో ప్రదర్శనకు ద్వితీయ బహుమతి లభించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్ అభయ్ రాజును అభినందించారు. ఈ 1కార్యక్రమంలో జిల్లా...