ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పనిచేయాలి..కలెక్టర్ బి సత్య ప్రసాద్
నవగీతం,మెట్ పల్లి: మెట్ పల్లి మండలం బండ లింగపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్య బోధన విధానం, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం అమలు, మౌలిక వసతులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. తరగతి గదిలో విద్యార్థుల పాఠ్యంశాల్లోని సెలబస్ ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ముఖాముఖి సంభాషణ జరిపి వారితో పాఠాలు చదివించి వారి భోదన...