navageetam.com
Newspaper Banner
Date of Publish : 31 March 2026, 2:10 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఉర్దూ మీడియం ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

రిజర్వేషన్ అభ్యర్థులు లేక ఖాళీగా ఉన్న ఉర్దూ మీడియం ఉపాధ్యాయ పోస్టులను క్యారీ ఫార్వర్డ్ చేయకుండా వెంటనే భర్తీ చేయాలని పి ఆర్ టి యు టీ ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శలు బోయినపల్లి ఆనంద్ రావు యాల్ల అమర్నాథ్ రెడ్డి అన్నారు మహమ్మద్ అబ్దుల్ లతీఫ్ స్కూల్ అసిస్టెంట్ (.సోషల్ ) గవర్నమెంట్ హై స్కూల్ కాజీపూర్ ఉద్యోగ విరమణ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరై వారు మాట్లాడుతూ ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టులు మంజూరు చేయాలని వారు కోరారు. అనంతరం మహమ్మద్ అబ్దుల్ లతీఫ్ సేవలను కొనియాడారు లతీఫ్ ని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ ఆఫీజ్ మాజీ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రహీం జమైతే ఇస్లామీ హిందూ జగిత్యాల జిల్లా అధ్యక్షులు షోయబ్ ఉల్లాక్ పాహిమ్ ఉపాధ్యాయలు శ్రీనివాస్ ఖతిబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు