ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి మోదిగంపల్లి సురేష్‌కు డాక్టరేట్
నవగీతం ,కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామానికి చెందిన మోదిగంపల్లి సురేష్ ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు.ప్రస్తుతం ఆయన కరీంనగర్‌లోని గవర్నమెంట్ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో భౌతిక శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు.భౌతిక శాస్త్ర విభాగంలో “అంశంపై పరిశోధన చేసి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డా. కె. సాధన పర్యవేక్షణలో థీసిస్ సమర్పించారు. పరిశోధనను పరిశీలించిన విశ్వవిద్యాలయం ఇటీవల ఆయనకు డాక్టరేట్ ప్రకటించింది. ఈ సందర్భంగా భౌతిక శాస్త్ర విభాగానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.మోదిగంపల్లి దేవయ్య–విజయ దంపతుల చివరి...