వడ్డేరలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఎంపీకి వినతి
నిజామాబాద్, అక్టోబర్22 (నవగీతం ప్రతినిధి):
నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్‌ను బుధవారం వడ్డేర సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు దసరా, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర వడ్డేర ప్రజల చిరకాల వాంఛ అయిన ఎస్టీ జాబితాలో వడ్డేరలను చేర్చాలనే డిమాండ్‌ను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. వడ్డేర సామాజిక వర్గానికి ఎస్టీ హోదా కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర వడ్డేర ప్రజలు చేస్తున్న పోరాటం, ఎదుర్కొంటున్న సమస్యలు, తమ హక్కుల సాధన కోసం చేపడుతున్న ప్రయత్నాలను ఎంపీకి వివరించారు.
వడ్డేర ప్రజల సమస్యలను, ఎస్టీ జాబితాలో చేర్చాలనే వారి డిమాండ్‌ను ఎంపీ ధర్మపురి అరవింద్‌కు వివరించగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి దేశెట్టి భూమేష్, బీజేవైఎం నాయకులు బైన ప్రశాంత్, బీజేపీ సీనియర్ నాయకులు అడప గంగాధర్, వడ్డేర సంఘం మాజీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ బోసు రాము తదితరులు పాల్గొన్నారు.